నర్సాపూర్ MLA సునీత లక్ష్మారెడ్డిని, BRS సీనియర్ నాయకులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. రైతులు, స్థానికుల ఆవేదన ఈ ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావడం లేదని ప్రశ్నించారు. నల్లవల్లి, ప్యారనగర్ గ్రామాల్లో 144 సెక్షన్ విధించి, భయానక వాతావరణ సృష్టించారని అన్నారు. అప్రకటి ఎమర్జెన్సీని తలపిస్తున్నారని.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని హరీష్ ప్రశ్నించారు.