BRS హయంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను సీఎం రేవంత్ తప్పుబట్టారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR వ్యాఖ్యానించారు. 'బీసీల రిజర్వేషన్ల పెంపుపై చట్టం తీసుకొస్తారని మేం భావించాం. కేసీఆర్ చేయించిన సమగ్ర కుటుంబ సర్వేలో 3.68 కోట్ల మంది పాల్గొన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల సంఖ్య 61 శాతం అని తేలింది. మరి ఇవాళ బీసీల శాతం, సంఖ్య ఎందుకు తగ్గింది?' అసెంబ్లీ వేదికగా అని ప్రశ్నించారు.