ప్రతి ఏటా ఆషాడ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తిథి రోజున(జులై 21) హిందువులు గురు పౌర్ణమి జరుపుకుంటారు. పురాణాల ప్రకారం పరాశర మహర్షి తన కుమారుడైన వ్యాస మహర్షికి వేదాన్ని ఉపదేశించాడు. తండ్రి నుంచి వేదాన్ని నేర్చుకున్న వ్యాసుడు ఒకటిగా ఉన్న వేదాన్ని విభజించి, అష్టాదశ పురాణాలను రచించి, మహాభారతం, భగవద్గీత వంటి విషయాలను ఈ లోకానికి అందించారు. అందుకే ఆయన జన్మించిన రోజునే గురు పౌర్ణమిగా జరుపుకుంటారు.