అమూర్ ఫాల్కన్లు డేగ జాతికి చెందిన చిన్న వేటాడే వలస పక్షులు. ఇవి పెద్ద సంఖ్యలో నివసించడం వల్ల భారత్‌లోని నాగాలాండ్ రాష్ట్రాన్ని ప్రపంచ ఫాల్కన్ రాజధానిగా వ్యవహరిస్తారు. ఇక ఈ పక్షులు వలస పక్షి జాతుల్లో ప్రపంచంలోనే ఎక్కువ దూరం ప్రయాణించేవిగా ప్రసిద్ధికెక్కాయి. మన దేశంలో నాగాలాండ్, అస్సాం, మణిపుర్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు అక్టోబరు-నవంబరు నెలల్లో లక్షల సంఖ్యలో చేరుకుంటాయి.