ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో తాజాగా మహిళల ఆరోగ్యంపై నిర్వహించిన ఓ వైద్య శిబిరంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 200 మంది మహిళలలో 148 మంది మహిళలు ఎముకల బలహీనత సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. అయితే వీటికి ప్రధాన కారణం పౌష్టికాహార లోపం, ఒత్తిడి. అయితే వీటిని అధిగమించాలంటే మహిళలు తరచుగా పాలు, గుడ్లు, జున్ను, పెరుగు లాంటి పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.