BRS సర్వే చేస్తే అసెంబ్లీ ఎందుకు పెట్టలేదు: కొండా సురేఖ

60చూసినవారు
BRS సర్వే చేస్తే అసెంబ్లీ ఎందుకు పెట్టలేదు: కొండా సురేఖ
నిజంగానే BRS సర్వే చేస్తే అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. సర్వే ప్రకారం మీరు బీసీలకు పదవులు ఇచ్చారా? అని ప్రశ్నించారు. 'కులగణన నివేదిక అమలు కాకుండా BRS నేతలు అడ్డుకోవాలని చూస్తున్నారు. BC నేతలు అప్రమత్తంగా ఉండండి. మన నోట్లో మనం మట్టి కొట్టుకోవద్దు. నేను బీసీ బిడ్డగా అప్పీల్ చేస్తున్నా. రాజకీయ పార్టీల ఉచ్చులో పడొద్దు. సర్వేలో తప్పులు ఉంటే మాకు చెప్పండి.. సరిదిద్దుతం' అని సూచించారు.

సంబంధిత పోస్ట్