TG: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల గ్రామ మాజీ సర్పంచ్ మట్టూరి సీతారత్నం ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. రెండు రోజుల క్రితం ఆమె భర్త మట్టూరి భద్రయ్య మృతి చెందాడు. రెండు రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతి చెందడంతో లింగాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.