యూపీలోని మైన్‌పురి జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. యోగేంద్ర యాదవ్ అనే వ్యక్తి ప్రియాంక అనే యువతిని ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో వారిద్దరూ పెళ్ళైన నెలకే తరచుగా గొడవ పడుతున్నారు. అయితే తాజాగా భార్య ప్రియాంక మద్యం తాగి తన భర్త యోగేంద్రను చెప్పుతో కొట్టి.. చంపేస్తానని అతన్ని బెదిరించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.