TG: భర్తకు బలవంతంగా మద్యం తాగించి భార్య కొట్టి చంపింది. 20 ఏళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ నుండి బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చిన జీషన్ అలీ (45) పూల వ్యాపారం చేస్తూ సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో భార్యతో కలిసి నివాసముంటున్నాడు. అయితే భర్త రోజూ మద్యం తాగి వచ్చి గొడవ చేస్తున్నాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు మందలించినా తీరు మారకపోవడంతో జీషన్‌కు బలవంతంగా మద్యం తాగించి ఇనుప రాడ్డుతో తలపై కొట్టి చంపింది.