AP: చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. శాంతిపురం మండలం సోలిశెట్టిపల్లికి చెందిన మీనా, గోవింద్ దంపతులు. ఇక ఆనంద్ అనే వ్యక్తితో మీనా ఎఫైర్ పెట్టుకుంది. ప్రియుడి మోజులో భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. భర్త హత్యకు పక్కా ప్లాన్ వేసింది. ప్రియుడితో కలిసి భర్త కళ్లలో కారం కొట్టి, బండరాయితో మోది కిరాతకంగా హత్య చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు.