అహ్మదాాబాద్ విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదం నింపింది. భార్య చివరి కోరిక తీర్చి, లండన్ వెళ్తున్న అర్జున్ భాయ్ ఈ దుర్ఘటనలో మరణించారు. అర్జున్ భార్య వారం క్రితం చనిపోయింది. ఆమె చివరి కోరిక మేరకు అస్తికలను నదిలో నిమజ్జనం చేసేందుకు ఆయన భారత్ వచ్చారు. తిరుగు ప్రయాణంలో విగతజీవుడయ్యారు. 8, 4 ఏళ్ల పిల్లలు వారం రోజుల్లో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలయ్యారు. వారి దీనపరిస్థితి అందరినీ కంటతడి పెట్టిస్తోంది.