AP: ప్రేయసితో ఉన్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని దాడి చేసిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటు చేసుకుంది. ఆకుల వాసు, నవ్యశ్రీ దంపతులకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వాసు బంధువుల అమ్మాయి వీణా గాయత్రితో మరో పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం నవ్యశ్రీకి తెలియడంతో వాసు, వీణా కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. సత్తెనపల్లిలోని ఓ ఇంట్లో ఉన్నారని తెలుసుకున్న నవ్యశ్రీ బంధువులతో కలిసి వెళ్లింది. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు దాడికి దిగారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.