బెంగళూరులో దారుణ దారుణ ఘటన చోటుచేసుకుంది. సుద్దగుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ మహిళ తన భర్తను దారుణంగా చంపేసింది. ఇంటి పనిమనిషితో భాస్కర్ చనువుగా ఉంటున్నాడని భార్య శృతి భాస్కర్ (40)ను కొట్టి చంపేసింది. గురువారం రాత్రి వారిద్దరి మధ్య గొడవ జరగడంతో శృతి చేతికి దొరికిన వస్తువుతో భర్తపై దాడి చేసింది. తలకు దెబ్బ తగిలిన భాస్కర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.