TG: అనుమానాస్పదంగా మృతి చెందిన యువకుడి కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని గర్యా తండాకు చెందిన నునావత్ రమేశ్, లలిత దంపతులు బతుకు దెరువు కోసం మేడ్చల్ కు వచ్చారు. ఈ క్రమంలో నర్సింహ అనే వ్యక్తితో లలితకు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో భర్త అడ్డు తొలగించేందుకు ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. ఈ నెల 10న మద్యం మత్తులో ఉన్న రమేశ్ మెడకు టవల్ తో ఉరి బిగించి హత్య చేసి బస్తీలోని ఖాళీ ప్రదేశంలో పడేశారు.