ప్రియుడి కోసం.. భర్త, పిల్లలకు విషం ఇచ్చిన భార్య

5చూసినవారు
ప్రియుడి కోసం.. భర్త, పిల్లలకు విషం ఇచ్చిన భార్య
ప్రియుడి కోసం ఓ మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలను చంపడానికి యత్నించిన ఘటన యూపీలోని బహ్జోయ్ పీఎస్ పరిధిలో జరిగింది. నైనా శర్మ అనే మహిళ ఆశిష్ మిశ్రా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొంది. ఈ క్రమంలో ఆమె భర్త గోపాల్ మిశ్రాను, పిల్లలను చంపాలని పథకం వేసింది. దీంతో మొదట వారికి విషం ఇవ్వాలని ప్రయత్నించగా విఫలమైంది. అనంతరం కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించగా వారు తప్పించుకున్నారు. గోపాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్