భార్య వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య

82చూసినవారు
భార్య వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య
TG: 'నువ్వు నాకు వద్దు.. చచ్చిపో' అంటూ భార్య అవమానించడంతో మనస్తాపం చెంది భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో జరిగింది. తడగొండకు చెందిన హరీశ్ (36)కు కావేరితో 2014లో వివాహం జరిగింది. హరీశ్ ఉపాధి కోసం దుబాయి వెళ్లగా.. అతడి భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో ఫోన్లో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ నెల 8న హరీశ్ దుబాయి నుంచి రాగా భార్య అవమానించింది. దీంతో మనస్తాపం చెంది హరీశ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్