ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ బావుటా ఎగరవేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై అధిష్టానం దృష్టి పెట్టింది. అయితే ఢిల్లీ సీఎంగా మహిళను నియమించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం రేసులో రేఖాగుప్త పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే శిఖారాయ్ పేరు కూడా పరిశీలనలో ఉందని తెలుస్తోంది. గతంలో ఢిల్లీకి సుష్మ, షీలా, అతిశీ CMలుగా పనిచేసిన సంగతి తెలిసిందే.