ఇకపై ఆకస్మిక తనిఖీలు చేస్తా: సీఎం రేవంత్

56చూసినవారు
ఇకపై ఆకస్మిక తనిఖీలు చేస్తా: సీఎం రేవంత్
ప్రభుత్వ ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. ఏ స్కూల్లోనైనా ఉపాధ్యాయులు లేకపోతే చర్యలుంటాయని అన్నారు. ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలిస్తున్నామని, వేతనం తీసుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా పనిచేయాలన్నారు. తప్పుంటే ఉన్నతాధికారులపైనైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. సెక్రటేరియట్ నుంచి పంచాయతీ వరకు ఫేస్ రికగ్నిషన్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్