TG: సూర్యాపేటలో గురువారం నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో పాదయాత్ర చేస్తామని వెల్లడించారు. ఈ సారి అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్ అని పేర్కొన్నారు. ఈ ఏడాదంతా బీఆర్ఎస్ పోరాట నామ సంవత్సరమే అని, దానికి ఏప్రిల్ 27న తొలి అడుగు పడబోతుందని చెప్పారు. పార్టీని అధికారంలోని తీసుకురావడమే తన లక్ష్యమన్నారు.