రాబర్ట్ వాద్రా గత రెండు రోజులుగా ఈడీ విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. త్వరలో తాను రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశారు. ప్రజలు తమతో ఉన్నారని, వారి కోసం రాజకీయాల్లోకి వస్తానన్నారు. మనీ లాండరింగ్ కేసులో హర్యానా ప్రభుత్వం తనకు క్లీన్ చిట్ ఇచ్చిందని, ఈడీ ప్రస్తుతం అడుగుతున్న ప్రశ్నలకు తాను 2019లోనే జవాబు ఇచ్చానని, కానీ మళ్లీ అవే ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారో తెలియట్లేదన్నారు.