ఫార్ములా-ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను ఈనెల 6న విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసు జారీ చేసింది. మరోవైపు ఇదే వ్యవహారంలో కేసు నమోదు చేసిన ఈడీ.. KTRను ఈ నెల 7న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ఇలా ఒకదాని తర్వాత మరో విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడటంతో కేటీఆర్ బృందం న్యాయవాదులతో సుదీర్ఘ చర్చలు జరుపుతోంది. విచారణలకు కేటీఆర్ హాజరవుతారా లేక సమయం కావాలని కోరతారా అనే అంశం న్యాయవాదుల బృందం నిర్ణయం ప్రకారం ఉంటుందని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.