‘మహిళా సమ్మాన్‌’ కొనసాగేనా..?

53చూసినవారు
‘మహిళా సమ్మాన్‌’ కొనసాగేనా..?
మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ పథకం ఈ ఏడాది మార్చితో ముగియనుంది. ‘ఆజాది కా అమృత్‌ మహోత్సవం’ సందర్భంగా 2023-24 సంవత్సరంలో దీనిని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద రూ.2 లక్షల వరకు పొదుపు చేసుకొనే అవకాశం కల్పించారు. దీనిపై 7.5శాతం వడ్డీని ప్రభుత్వం ఇస్తోంది. ఈ స్కీమ్‌ గడువు మార్చి 31తో ముగిసిపోనుంది. అయితే ఈ సారి దీనిని పొడిగించకపోవచ్చని వెల్త్‌ట్రస్ట్‌ క్యాపిటల్‌ సర్వీస్‌ స్నేహా జైన్‌ తెలిపారు.

సంబంధిత పోస్ట్