TG: రాజకీయాల కోసం తాము ఏదీ చేయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 'సమగ్ర సర్వే వివరాలు కేసీఆర్ చెప్పాలి. కేసీఆర్ కుటుంబం ఏ పని చేసినా చిత్తశుద్ధి ఉండదు. రాజకీయ లబ్ధి కోసమే చేస్తారు. రాష్ట్రంలో 56శాతం బీసీలు, 17శాతం ఎస్సీలు ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు తీర్పు, కమిషన్ నివేదిక, సబ్ కమిటీ నివేదికల సూచనల ప్రకారమే ముందుకు వెళ్లాం' అని పేర్కొన్నారు.