హిందూ పండుగలకే ఆంక్షలు గుర్తొస్తాయా?: రాజాసింగ్

56చూసినవారు
హోలీ రోజు గుంపులుగా తిరగొద్దంటూ హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించడంపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. 'హిందువుల పండుగలకే మీకు ఆంక్షలు గుర్తొస్తాయా? మా పండుగ ఎలా జరుపుకోవాలో పోలీసులు, 9వ నిజాం రేవంత్ చెప్తారా? రంజాన్ నెలలో రాత్రి నుంచి తెల్లారే వరకు జరిగే న్యూసెన్స్ కనబడట్లేదా?' అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్