కొత్త హోం మంత్రిగా వాకిటి శ్రీహరి?

59చూసినవారు
కొత్త హోం మంత్రిగా వాకిటి శ్రీహరి?
TG: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ తర్వాత ఎవరికి ఏ శాఖ దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. అయితే తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తానని తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీంతో కొత్త హోం మంత్రి పదవి ఎవరిని వరిస్తుందోననే చర్చ మొదలైంది. అయితే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, బీసీలోని బలమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో వాకిటి శ్రీహరికే ఈ అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రానికి స్పష్టత రానుంది.

సంబంధిత పోస్ట్