ట్రంప్‌తో కలిసి రెట్టింపు వేగంతో పని చేస్తా: ప్రధాని మోదీ

59చూసినవారు
ట్రంప్‌తో కలిసి రెట్టింపు వేగంతో పని చేస్తా: ప్రధాని మోదీ
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. మోదీ తనకు మంచి స్నేహితుడని, రానున్న నాలుగేళ్లు స్నేహాన్ని కొనసాగిస్తామని ట్రంప్‌ తెలిపారు. భారత్‌కు మోదీ లాంటి నాయకుడు ఉండటం గర్వకారణమన్నారు. ట్రంప్‌తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని మోదీ అన్నారు. భారత్‌- అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. రెట్టింపు వేగంతో పని చేస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్