ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా?: మంత్రి పొన్నం

72చూసినవారు
ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా?.. ఎలా ఇవ్వరో మేమూ చూస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత ఇందిరమ్మపై అవహేళనగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. 'ఇందిరమ్మను వాజ్‌పేయీ కాళీమాతతో పొల్చారు. 10 నెలల కాలంలో GST రూపంలో రూ.37 వేల కోట్లు కేంద్రం వసూలు చేసింది. మరి కేంద్రం తెలంగాణకు ఇచ్చింది ఎంత? ఇద్దరు కేంద్ర మంత్రులు ఓక్క రూపాయన్న కేంద్రం నుంచి తెచ్చారా?' అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్