లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ స్థానంలో న్యూజిలాండ్ పేసర్ విలియం ఓ రూర్కేను తీసుకుంది. గాయంతో కొన్ని నెలలుగా ఆటకు దూరంగా ఉన్న అతను ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు రెండే మ్యాచ్‌లు ఆడిన మయాంక్ మళ్లీ గాయపడడంతో అతడి స్థానంలో విలియం ఓ రూర్క్‌ను కనీస ధర రూ.3 కోట్లకు జట్టులోకి తీసుకున్నట్లు లక్నో ఫ్రాంఛైజీ వెల్లడించింది.