తెలంగాణలో శనివారం వైన్ షాపులు బంద్ కానున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ 12వ తేదీన వైన్ షాపులు మూసివేయాలని హైదరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 12న ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 13న ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ కానున్నాయి. అయితే స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉండనుంది.