జమ్ము కశ్మీర్‌లోని రాజౌరీలో అంతుచిక్కని రోగాలతో ఇప్పటికే 17 మంది మృతి చెందగా.. మరెంతో మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 45 రోజుల వ్యవధిలోనే మూడు కుటుంబాలకు చెందిన ఇంత మంది ప్రాణాలు కోల్పోవడంతో వైద్యారోగ్య శాఖ అసలేం జరుగుతుందో తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తోంది. ఇప్పటికే రాజౌరీని మెడికల్ ఎమర్జెన్సీగా ప్రకటించగా.. తాజాగా వైద్య సిబ్బందికి ఇచ్చే శీతకాలపు సెలవులను సైతం రద్దు చేసింది.