‘మదగజ రాజ’ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటి వరలక్ష్మి శరత్‌కుమార్ పాల్గొన్నారు. విశాల్ ఆరోగ్యం గురించి విలేకరి ప్రశ్నించగా ఆమె స్పందించారు. అభిమానుల ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. ‘‘విశాల్ ఆరోగ్య పరిస్థితి గురించి వస్తోన్న వార్తలు చూశాను. ఆయన వైరల్ ఫీవర్‌తో ఇబ్బందిపడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని.. మంచి ఆరోగ్యంతో ప్రేక్షకుల ముందుకురావాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు.