TG: తొలి విడతలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున విడుదల చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. బేస్‌మెంట్ వరకు పూర్తి చేసుకున్న 2019 మంది ఖాతాల్లో రూ.లక్ష చొప్పున మొత్తం రూ.20.19 కోట్లను ఒకట్రెండు రోజుల్లో జమ చేయనున్నారు. మొదటి విడతలో నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 70,122 మందికి ఇళ్లను మంజూరు చేశారు. వారిలో ఇప్పటివరకు 13,520 మంది ముగ్గు పోసి పనులు కొనసాగిస్తున్నారు.