మహారాష్ట్రలోని గురువారం షాకింగ్ ఘటన జరిగింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ ఆఫీస్‌లో ఓ మహిళ హల్చల్ చేసింది. ఎంట్రీ పాస్ లేకుండానే డిప్యూటీ సీఎం ఆఫీస్‌లోకి వెళ్లి దేవేంద్ర ఫడ్నవీస్ అని ఉన్న నేమ్ బోర్డ్‌ను తీసి కింద పడేసింది. అనంతరం ఆఫీస్‌లో ఉన్న పూల కుండీలను తీసి పగుల గొట్టింది. మహిళ ఆచూకీ కోసం పోలీసులు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.