TG: హైదరాబాద్ దుర్గం చెరువులో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కాప్రాలోని ఎల్లారెడ్డిగూడకు చెందిన దుర్గామాధవి గురువారం సూసైడ్ చేసుకోబోతున్నట్లు తన ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకుని ఇంటినుంచి వెళ్లిపోయింది. దీంతో భర్త ప్రభు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శనివారం దుర్గం చెరువులో లభించిన మృతదేహాన్ని పరిశీలించి ఆమె దుర్గాగా గుర్తించారు. ఆమె మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.