ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. మహిళ ఒంటరిగా ఉండటం చూసిన పొరుగింటి వ్యక్తి దురుద్దేశంతో ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం ఆమెను అత్యాచారం చేయడానికి యత్నించాడు. దీంతో ఆమె ఆ వ్యక్తి ప్రైవేట్ పార్ట్‌లను కట్ చేసింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. తనను అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని మహిళ ఆరోపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.