TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రేగొండ మండలం రాయపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందింది. గ్రామానికి చెందిన నీటూరి నీలమ్మ(55) స్నానానికి వాటర్ హీటర్ పెట్టుకుంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలింది. దీంతో విద్యుత్ షాక్ కొట్టి అక్కడికక్కడే నీలమ్మ మృతి చెందింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ కుమార్ తెలిపారు.