AP: బంధువుల గొడవపై పీఎస్‌కు వెళ్లిన తనతో మడకశిర సీఐ రాగిరి రామయ్య అసభ్యకరంగా మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేశారు. రాత్రి సమయంలో తనను ఒంటరిగా చాంబర్‌లోకి పిలిచి అవమానకరంగా మాట్లాడారని గాయత్రి అనే మహిళ తెలిపారు. ఒంటరిగా ఎలా ఉంటున్నావని, నేను సపోర్ట్ చేస్తా అంటూ అసభ్యంగా మాట్లాడారని మహిళ చెప్పారు. తనకు తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి పిలవగా వారు స్టేషన్‌కు వచ్చి నిలదీశారన్నారు.