వివాహేతర సంబంధం కారణంగా ఓ మహిళ హత్యకు గురైన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. గంగాధర మండలంలో గతనెల 25న మమత అనే మహిళ షాపుకి వెళ్లి తిరిగి రాలేదు. ఇటీవల ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఆమె హత్యకు అక్రమ సంబంధమే కారణమని తెలిపారు. మంచిర్యాల జిల్లాకు చెందిన సింగరేణి ఉద్యోగి భాస్కర్‌తో ఆమె సాన్నిహిత్యంతో ఉందని, ఆ కోపంతో అతని కుటుంబసభ్యులు మమతను హత్య చేయించారని తెలిపారు.