TG: ఒంటరిగా ఉన్న మహిళపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. నిర్మల్(D)లోని ఓ గ్రామానికి చెందిన మహిళ భర్తతో గొడవ పడి శుక్రవారం రాత్రి నిర్మల్ బస్టాండ్‌కు రాగా ఓ వ్యక్తి మహిళను లాడ్జీకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అక్కడి నుంచి తిరిగి బస్టాండ్‌కు వచ్చి ఓ ఆటోలో కూర్చొని స్పృహ తప్పింది. ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.