మహిళ మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి కాల్చేశారు

72చూసినవారు
మహిళ మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి కాల్చేశారు
ఢిల్లీలోని ఘాజీపూర్‌లో ఘోర సంఘటన జరిగింది. ఓ మహిళను చంపి సూట్‌కేసులో పెట్టి తగలబెట్టారు. శిల్పా పాండే అనే మహిళ ఏడాదిగా అమిత్ తివారీ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఆమె తనను పెళ్లి చేసుకోవాలని అతడిపై ఒత్తిడి చేస్తోంది. అయితే, జనవరి 25న అమిత్ మద్యం మత్తులో శిల్పతో గొడవపడి ఆమెను గొంతు కోసి చంపాడు. తర్వాత ఆమె మృతదేహాన్ని తన స్నేహితుడు అనుజ్ కుమార్‌ సాయంతో ఓ సూట్‌కేసులో పెట్టి కాల్చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్