భూమి చౌహాన్ అనే మహిళా ప్రయాణీకురాలు లండన్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాన్ని కేవలం 10 నిమిషాల తేడాతో మిస్ అయింది. అహ్మదాబాద్ ట్రాఫిక్ కారణంగా ఆలస్యం కావడం విమానం మిస్ అయినట్లు పేర్కొంది. అయితే ప్రస్తుతం ఆమె సెలవులపై భారత్‌కు వచ్చానని, తన భర్త లండన్‌లో ఉన్నాడని, అతడి దగ్గరకు వెళ్లడానికి టికెట్లు బుక్ చేసినట్లు వెల్లడించింది. విమానం మిస్ కావడంతో తిరిగి ఇంటికి వెళ్లాలని చెప్పింది. ఫ్లైట్ మిస్ కావడం తన మంచికే అంటూ పేర్కొంది.