AP: పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఒక యువతి కడుపు నొప్పితో ఆస్పత్రికి చేరింది. దీంతో వైద్యులు స్కాన్ చేసి చూడగా.. ఆమె పొట్టలో ఉన్న పెన్నులు చూసి షాక్ అయ్యారు. వెంటనే లాప్రోస్కోపీ శస్త్రచికిత్స నిర్వహించి పెన్నులను సురక్షితంగా బయటకు తీశారు. భార్యాభర్తల మధ్య వాగ్వాదం నేపథ్యంలో క్షణికావేశంలో ఆమె పెన్నులు మింగినట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని పేర్కొన్నారు.