సాధారణంగా పెళ్లి అనగానే అందరూ బిజీగా ఉంటారు. ఏదో పని చేస్తూ హడావిడిగా వారి పని వారు చేస్తూ పరిసరాలను గమనించరు. ఇదే అదనుగా చేసుకున్న ఓ మహిళ ఓ పెళ్లి వేడుకలో తన చేతివాటం చూపించింది. ఇంట్లో మొత్తం వెతికి దొరికిన కాడికి దోచుకుని వెళ్లిపోయింది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మలేషియాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.