ప్రస్తుతం సోషల్ మీడియాలో మందు తాగిన ఓ మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ మహిళ ఫుల్‌గా మందు కొట్టి రోడ్డుపైకి వచ్చేసింది. అంతటితో ఆగకుండా ఓ బస్సుకు ఎదురుగా వెళ్లి ఆపింది. ఈమె వింత చేష్టలు చూసి షాకైన డ్రైవర్ చాలా సేపు వాహనాన్ని ఆపి ఉంచాడు. ఆ తర్వాత ఆమె రోడ్డుపైనే పడుకుండిపోయింది. పోలీసులు అక్కడికి చేరుకుని చివరకు ఆమెను అక్కడి నుంచి తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.