పురాణాల ప్రకారం తిరుమలను పూల మంటపంగా పిలిచేవారు. తిరుమల పూల మంటపం కావడంతో పుష్పాలంకరణ ప్రియుడైన శ్రీహరిని నిత్యం టన్నుల కొద్దీ పూలతో అలంకరించి పూజలు చేస్తుంటారు. అలాగే తిరుమలలో పూచే ప్రతి పుష్పం శ్రీమన్ననారాయణునికి అంకితమని భావిస్తారు. అందుకే టీటీడీ స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు పూలను తాకకూడదనే నిబంధనను అమలులోకి తెచ్చింది. ఈ కారణం చేతనే స్వామివారి దర్శనానికి వచ్చే మహిళలు తలలో పూలు ధరించరు.