TG: ప్రభుత్వం మహిళల కోసం ప్రారంభించిన ఉచిత బస్సు పథకం పలుచోట్ల మహిళల గొడవలకు కారణం అవుతోంది. మహిళల అభ్యున్నతి కోసం ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తే మహిళలు బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకొని పొట్టు పొట్టు కొట్టుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. 'నీ అంతు చూస్తా బిడ్డా' అంటూ.. మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సులో ఇద్దరు మహిళలు సిగపట్లు పట్టారు.