బస్సు సీటు కోసం మహిళలు జుట్లు పట్టుకొని పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గమైన మంథనిలోని కాళేశ్వరం దేవస్థానం బస్టాండ్‌లో ఈ ఘటన జరిగింది. బస్టాండ్‌లో బస్సు కోసం చాలా సేపు వేచిచూడగా ఒకే ఒక్క బస్సు రావడంతో సీటు కోసం గొడవ పడి ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. సరిపడా బస్సులు లేకపోవడంతోనే తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు మహిళలు వాపోయారు.