కర్నల్‌ సోఫియా ఖురేషీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండిపడ్డ మహిళా కమిషన్‌

79చూసినవారు
కర్నల్‌ సోఫియా ఖురేషీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండిపడ్డ మహిళా కమిషన్‌
పాక్‌తో జరిగిన దాడికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించిన కర్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. మంత్రి పేరు నేరుగా ప్రస్తావించకపోయినా, యూనిఫామ్‌లో సేవ చేస్తున్న మహిళలను గౌరవించాల్సిన అవసరం ఉందని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ విజయ రహాట్కర్ పేర్కొన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె ట్వీట్‌ చేశారు.

సంబంధిత పోస్ట్