TG: రాష్ట్రంలో 60 ఏళ్లు దాటిన స్త్రీలు, దివ్యాంగులైన మహిళలతో ప్రత్యేకంగా మహిళా స్వయం సహాయక సంఘాలను(SHG) ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న సంఘాలకు అదనంగా కొత్త సంఘాలు ఏర్పాటు చేసి, అందులో వారిని సభ్యులుగా చేర్చాలనే యోచనలో సెర్ప్ వర్గాలు ఉన్నాయి. ఆసరా పింఛనును ప్రామాణికంగా తీసుకుని కొత్త సంఘాలలో మహిళలకు సభ్యత్వం కల్పించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.