దసరాలోపు మహిళా సంఘాల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు!

71చూసినవారు
దసరాలోపు మహిళా సంఘాల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు!
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెప్పనుంది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం తగ్గించి, ఆదాయాన్ని పెంచేందుకు ‘ఇందిరా మహిళా శక్తి పథకం’ కింద మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు దసరాలోపు ఈ సోలార్ ప్లాంట్లను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రతి ప్లాంటును 0.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో తయారు చేస్తోంది. ఒక్కో ప్లాంటుకు రూ.1.50 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్